Siddaramaiah | ఆసక్తి ఉంటే ఇది చదవండి కేటీఆర్.. కర్ణాటక సీఎం స్ట్రాంగ్ కౌంటర్

-

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) కి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏది నిజమో ఏది అసత్యము ఏది ఎడిట్ చేశారో తెలుసుకోలేకపోవడమేనంటూ సెటైర్స్ వేశారు. ఇంతకీ కర్ణాటక సీఎం మన మాజీ మంత్రిపై ఎందుకు అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు? కేటీఆర్ ఏమంటే సిద్ధరామయ్యకు అంత కోపం వచ్చింది? ఇప్పుడే తెలుసుకుందాం.

- Advertisement -

సోషల్ మీడియాలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. “ఎన్నికల్లో ఓట్ల కోసం చాలా హామీలు ఇస్తూ ఉంటాం. అంతమాత్రాన అవన్నీ ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది అయితే డబ్బులు లేవు” అని కర్ణాటక సీఎం అసెంబ్లీలో మాట్లాడినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోను తెలంగాణ బీఆర్ఎస్ నేతలు షేర్ చేస్తూ.. కర్ణాటక పరిస్థితే తెలంగాణలోనూ ఉంటుంది అంటుంది ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.

ఇక ఇదే వీడియోని కేటీఆర్ షేర్ చేస్తూ.. “ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మా దగ్గర డబ్బులు లేవంటూ కర్ణాటక సీఎం చెబుతున్నారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా భవిష్యత్తులో ఇలానే ఉండబోతుందా? విపరీతమైన హామీలు ఇచ్చేముందు కనీసం ప్రాథమిక పరిశోధన, ప్రణాళిక వేసుకోరా” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు.

“తెలంగాణా ఎన్నికలలో మీ పార్టీ(BRS) ఎందుకు ఓడిపోయిందో తెలుసా? ఎందుకంటే మీకు ఏది ఫేక్, ఏది ఎడిట్ చేయబడినది, ఏది నిజం అని ఎలా ధృవీకరించాలో కూడా మీకు తెలియదు. బీజేపీ ఎడిట్ చేసి ఫేక్ వీడియోలను సృష్టిస్తుంది., మీ పార్టీ వాటిని సర్క్యులేట్ చేస్తుంది. మీది బీజేపీకి చెందిన పర్ఫెక్ట్ బి టీమ్. మీకు ఇంకా వాస్తవాలపై తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, దీన్ని చదవండి” అంటూ అసెంబ్లీ లో ఆయన చేసిన వ్యాఖ్యలకు వీడియో జత చేసిన ట్వీట్ లింక్ ని షేర్ చేశారు.

Read Also: నేడు ఇండియా కూటమి భేటీ.. హాట్ టాపిక్ గా మమత, కేజ్రీవాల్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...