BRS MP candidates list: మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

-

తెలంగాణ భవన్‌లో కీలక నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరో మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు అవకాశం ఇచ్చారు. ఇక భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌, నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 16 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. హైదరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -

ఇదిలా ఉంటే సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ఎంపిక కావడంతో ఈ నియోకజకవర్గంలో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. దీంతో ముగ్గురు కీలక నేతలు పోటీలో నిలవడంతో ఈ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...