నిమ్స్ ఆసుపత్రి విస్తరణకు సీఎం కేసీఆర్ భూమి పూజ

-

వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. ఇలాంటి కీలక రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. భవిష్యత్తుల్లో రాబోయే మహమ్మారులను ఎదుర్కోవాలంటే ఆరోగ్య శాఖ(Department of Health) పటిష్ఠంగా ఉండాలని పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రి(Nims Hospital) విస్తరణలో భాగంగా దశాబ్ది బ్లాక్ పేరుతో ఎర్రమంజిల్ లో తలపెట్టిన భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ప్రస్తుతం నిమ్స్‌ భవనానం పక్కనే 32 ఎకరాల స్థలంలో రూ.1571 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. 2వేల పడకల సామర్థ్యంతో నిర్మించే ఈ కొత్త భవనంలో ఔట్‌ పేషెంట్‌, ఎమర్జెన్సీ వైద్యం కోసం ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేయనున్నారు. 32 మాడ్యులర్‌ ఆపరేషన్ థియేటర్లు, 6 మేజర్‌ మాడ్యులర్‌ థియేటర్లతో మొత్తం మూడు బ్లాకులలో నిమ్స్ టవర్ నిర్మించనున్నారు. ఈ నిర్మాణంతో దేశంలో అత్యధిక సూపర్‌ స్పెషాలిటీ పడకలు ఉన్న ఆసుపత్రిగా నిమ్స్‌(Nims Hospital) నిలవనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Read Also:
1. పొంగులేటితో భేటీ కానున్న రేవంత్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...