వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్‌లోని తన సొంతింటికి వెళ్లారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీశ్‌రావు(Harish Rao), ఎంపీ సంతోష్ కుమార్, ఇతర నేతలు ఉన్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే రెండు నెలలు పైగా పడుతుందని వైద్యులు చెప్పడంతో ఆయన అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే ఇంట్లోనే కొన్ని రోజులు పాటు ఫిజియోథెరపీ చికిత్స చేయనున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), తెలంగాణ మంత్రులు, సినీ ప్రముఖులు, తదితరులు ఆయనను పరామర్శించి త్వరగా కోలుకుని ఆకాంక్షించారు. కాగా డిసెంబర్ 7న ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నివాసంలో కేసీఆర్(KCR) కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. తుంటి ఎముక విరగడంతో వైద్యులు సర్జరీ చేసి హిప్ బోన్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ నిర్వహించారు.