KCR Health Bulletin | తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. కేసీఆర్ ఎడమ కాలు తుంటి భాగంలో హిప్ రీప్లేస్‌మెంట్ చేయాలని.. సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేస్తామని తెలిపారు. సర్జరీ తరువాత ఆయనకు 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
KCR Health Bulletin | మాజీ సీఎం గాయంపై ప్రధాని మోదీ స్పందిస్తూ “కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధ కలిగింది. ఆయన ఆరోగ్యం బాగుండాలని గాయం నుంచి త్వరగా కోలుకోవాలి అని” ట్వీట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు. కేసీఆర్(KCR) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దయచేసి ఎవరూ ఆసుపత్రి వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా గురువారం అర్థరాత్రి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్ కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి(Yashoda Hospital)కి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన తుంటి ఎముక విరిగిందని గుర్తించారు. దీంతో ఆయనకు సర్జరీ చేయనున్నారు.