అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పలు ప్రశ్నలు సంధించారు. దళితుల సంక్షేమంపై చేపట్టిన వివిధ పథకాలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేద దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. మంత్రివర్గంలో, డీజీపీ, సీఎస్, తదితర పోస్టుల్లో బీసీ, ఎస్‌సీ, ఎస్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. ధరణి పోర్టల్(Dharani Portal) ఏర్పాటు చేసి పేదల భూములను లాక్కుంటూ పెద్దల పేరిట మార్పిడి చేస్తున్నారని విమర్శించారు.
అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితబంధు పథకం ప్రారంభించి రెండేళ్లయినా ముందుకు సాగడం లేదని భట్టి(Bhatti Vikramarka) విమర్శించారు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనా నిధులు ఖర్చు చేయలేదన్నారు. ఇక దళితుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని తెలిపారు. ఆ పథకాలను అమలు చేస్తేచాలని, కొత్త కొత్త హామీలిస్తూ ప్రజలను మోసపుచ్చడం తగదని హితవు పలికారు.
Read Also: కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటది: KTR
Follow us on: Google News, Koo, Twitter