Shankaramma | అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి?

-

తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ(Shankaramma)కు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందింది. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagadish Reddy) ఆమెను ప్రగతి భవన్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో శంకరమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆమెకు కీలక పదవి ఇస్తామని బీఆర్‌ఎస్(BRS) అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చింది. అయితే తనకిచ్చిన హామీని నెరవేర్చడంలో జాప్యం జరగడంతో ప్రభుత్వంపై శంకరమ్మ(Shankaramma) గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ముగింపు రోజున అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనుంది. ఈ మేరకు ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గర అమరవీరుల స్తూపం నిర్మించారు. గురువారం సీఎం కేసీఆర్(CM KCR) ఈ స్మారక స్తూపాన్ని ప్రారంభించనున్నారు. అయితే అమరవీరులను సర్కార్ పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జోరుగా జరుగుతోంది.

- Advertisement -
Read Also:
1. ఫ్లైఓవర్ ర్యాంప్ ప్రమాద బాధితులను పరామర్శించిన కేటీఆర్
2. చెర్రీ కంగ్రాట్స్.. నిన్ను ఎత్తుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి: రోజా

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...