Key comments of former ias of telangana on Ews Reservations: అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం కోటా రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే.. ఈక్రమంలో ఈ అంశంపై మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి స్పందించారు. ఈ సందర్భంగా.. శనివారం ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. దీనిలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల (Ews Reservations) విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవద్దని అన్నారు. కానీ గతంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని పలు కమిటీలు, గత ప్రభుత్వాలు చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఖండించిందని… ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తన తీర్పును తానే తూచ్ అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఎందుకు ధ్వంద వైఖరి చూపిస్తుందని నిలదీశారు. గతంలో బీసీల కోటా పెంచాలని అడిగితే రిజర్వేషన్ల సీల్ 50 శాతం దాటకూడదని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఏందుకు అగ్రకులాల విషయంలో మరో నీతి అవలంభిస్తోందని అన్నారు.
ఈ దేశంలో సామాజిక న్యాయం చాలా అవసరం.నా అనుభవంలో మెరిట్ అనేది ( 5-10 మార్కుల తేడాతో వచ్చే మెరిట్) పెద్ద విషయం కాదు.అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు పరిపాలన లో లేకపోతే వచ్చే నష్టం ప్రమాదకరం
అస్సలు కామన్ స్కూల్ విధానం ద్వారా అందరికి నాణ్యమైన విద్య ఇస్తే రిజర్వేషన్స్ తీసెయ్యొచ్చు ఒక 20 సo లో pic.twitter.com/j95tadQtfe— Murali Akunuri (@Murali_IASretd) November 12, 2022