Kishan Reddy: మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ కేవలం ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మానికి, న్యాయానికి, అక్రమాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలే.. మునుగోడు ఉప ఎన్నికలు అని అభివర్ణించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా రత్తిపల్లి, గంగోని గూడెం గ్రామాల్లో కిషన్ రెడ్డి పర్యటించారు.
మునుగోడులో గెలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్‌ఎస్ కోట్లు కుమ్మరించినా.. వారి బలం పెరగటం లేదన్నారు. అందుకే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబం సూట్ కేసుల నిండా డబ్బులు, లారీల నిండా మద్యం, చికెన్, బిర్యానీ పొట్లాలతో వస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అడుగుఅడుగునా వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఓపెన్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పథకాల పేరిట డబ్బులు చేతిలో పెట్టి.. మరో చేతితో మద్యం విక్రయిస్తూ, ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటుందని Kishan Reddy ఆరోపించారు.
Read also: ఏపీ టోల్ ప్లాజా సిబ్బందిపై.. తమిళనాడు విద్యార్థులు దాడి