ముఖ్యమంత్రి వెళ్లని సచివాలయం ఉంటే ఎంత.. లేకుంటే ఎంత!

-

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో సచివాలయం నిర్మించిన కేసీఆర్‌కు తొమ్మిదేళ్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం చేతకాలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్(BRS) రెండోసారి అధికారంలోకి వచ్చినా.. ఇప్పటి వరకు ఇచ్చింది లేదని, అదే సెక్రటేరియట్ మాత్రం 4 నెలల్లో కట్టుకున్నారని, పేదలను మోసం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్(Pragati Bhavan), ముఖ్యమంత్రి వెళ్ళని సచివాలయం ఎందుకని ఆయన ఘాటు విమర్శలు చేశారు. కొత్త సచివాలయం(New Secretariat) ప్రారంభోత్సవంలో కొన్ని మీడియా సంస్థలపై ఆంక్షలు విధించడం సరికాదని కేంద్రమంత్రి(Kishan Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమం సమయాల్లో మీడియా సంస్థలను వాడుకొని ఇప్పుడు ద్వేషించడం మంచి పద్ధతి కాదని కోపోద్రిక్తులయ్యారు. నిజాం రాచరిక ఆలోచనలతో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

- Advertisement -
Read Also: పంజాబ్‌ లుథియానాలో ఘోరం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో వారికే తొలి ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది....

TG Govt | ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

TG Govt | తెలంగాణలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సీఎం రేవంత్...