Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో తెలంగాణ బీజేపీ శ్రేణులు లేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీబీసీపై ఐటీ దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. బీబీసీ సంస్థపై ఐటీ దాడులపై బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని మీడియా చానళ్లను ఇబ్బందులకు గురిచేసిందో అందరికీ తెలుసని మండిపడ్డారు. పత్రిక స్వేచ్ఛ విషయంలో తమకు బీఆర్ఎస్ నేతలు నీతులు బోధించాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మీడియా సంస్థలపై దాడులు చేయడం లేదని, అది బీఆర్ఎస్ పార్టీకి అలవాటైన పని అని అన్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో దేశ పర్యాటక రంగం పుంజుకుని అభివృద్ధి పట్టాలెక్కుతోందని అన్నారు.
Read Also: