Kishan Reddy Fires On CM KCR: కిరాయి మనుషులతో బ్యానర్‌లు కట్టి మోడీని అడ్డుకోలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా తెలంగాణలో వెలసిన బ్యానర్లను ఉద్దేశించి బేగంపేట్‌లో నిర్వహించిన బీజేపీ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ మళ్లీ తెలంగాణకు వస్తారని.. కేసీఆర్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా.. మోడీని అడ్డుకోలేరన్నారు. రాష్ట్ర సీఎంగా స్వాగతం పలకాల్సిన వ్యక్తి.. వ్యవహరించే తీరు ఇదికాదన్నారు. ట్రైబల్ మ్యూజియంకి ఇప్పటివరకు కేసీఆర్ భూమి ఇవ్వలేదని గుర్తుచేశారు. సైన్స్ సిటీకి కూడా ల్యాండ్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసిఆర్ ఆ విషయన్ని కూడా మర్చిపోయారని మండిపడ్డారు. కేసీఆర్‌కు రాష్ట్రం గురించి ఆలోచన లేదని.. కేవలం తన కుటుంబమే సీఎం కేసీఆర్‌కు ముఖ్యమన్నారు.