ఖమ్మం వేదికగా తెలంగాణ బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలలు ఆగితే ఏ పార్టీ ఖతం అవుతుందో తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని నడపలేక రాహుల్ గాంధీ పారిపోయారంటూ విమర్శించారు.. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఘోరంగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్‌కు బీ టీమ్ బీఆర్‌ఎసే.. అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా బీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారు.. బీజేపీపై అనేక రకాలుగా కుట్ర జరుగుతోంది.. రాష్ట్రపతి ఎన్నికల టైమ్‌లో బీజేపీని కేసీఆర్ విమర్శించారు.. బీఆర్‌ఎస్‌తో మీరు కలిశారా..? మేము కలిశామా..? అంటూ కిషన్ మండిపడ్డారు. కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) రెండు కుటుంబ పార్టీలే.. అఖిలేశ్(Akhilesh Yadav)తో కేసీఆర్ భేటీ కావడం చూస్తే.. ఎవరు ఎవరికి బీ టీమో తెలుస్తుందన్నారు. గతంలో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.. బీజేపీని విమర్శించే నైతికహక్కు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు లేదు.. మాకు కాంగ్రెస్ ఎంత దూరమో.. బీఆర్‌ఎస్ కూడా అంతే దూరమని కిషన్(Kishan Reddy) అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల అవినీతిపై మా పోరాటం కొనసాగుతోందని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ఎంఐఎంను పెంచిపోషిచాయని తెలిపారు.
Read Also:
1. రేపు హైదరాబాద్‌లో ఈ రూట్లలో ప్రయాణిస్తున్నారా?
2. పెళ్లి కాని వారికి పెన్షన్.. సీఎం కీలక నిర్ణయం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat