తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ పథకాలు అమలయ్యే అవకాశం లేదంటూ ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు చివరికి మిగిలేది కాంగ్రెస్ గారడీ మాత్రమే అని వ్యాఖ్యానించారు. 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానిని చెయ్యాలి, అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అలా జరగకుంటే అమలయ్యే ఛాన్స్ లేదని అంటున్నారన్నారు.
అయితే, 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడని కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. మరి అలాంటప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసే ఛాన్స్ లేదని, మిగిలేది కాంగ్రెస్ గారడీ మాత్రమే అని ఎద్దేవా చేశారు. కాగా, ఇటీవల గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో CM రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడారు. ఈ సందర్భంగా.. 17 ఎంపీ స్థానాల్లో పార్టీని గెలిపించాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 6 గ్యారెంటీలు అమలు చేయడం సులభం అవుతుంది అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.