మాజీ మంత్రి హరీష్‌రావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా “హరీష్‌రావు కష్టపడతారని కానీ బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు భవిష్యత్తు లేదు. వన్ బై ధర్డ్ అంటే తనతో పాటు 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే.. హరీష్‌రావు(Harish Rao)కు దేవాదాయశాఖ మంత్రి పదవి కూడా ఇస్తాం. అలాగైనా చేసిన పాపాలు కడుక్కోవచ్చు. హరీష్‌రావు, కడియం శ్రీహరి లాగా మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు.. ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీని చీల్చాలని గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు. చీప్ పాలిటిక్స్ మానుకోవాలి” అని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత తమపై పడింది. బీఆర్ఎస్ నల్గొండ సభ కోసం డబ్బులు పెట్టి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రజల కాళ్లు పట్టుకుంటున్నారు. సభకు ప్రజలు రారు కార్యకర్తలు మాత్రమే వస్తారు. కచ్చితంగా నల్గొండ సభ అట్టర్ ప్లాప్ అవుతుంది. కేటీఆర్‌కు దమ్ముంటే పార్టీని నడపాలి” అని సవాల్ విసిరారు. హరీష్‌రావును కాంగ్రెస్‌లోకి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) ఆహ్వానించడం తీవ్ర చర్చనీయాంశమైంది.