కాంగ్రెస్‌లో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

-

తాను బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీని బలహీనపర్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి మళ్లీ రావాలని కొంతమంది తనను సంప్రదించిన మాట వాస్తవేమనని పేర్కొన్నారు. అయితే టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాను పనిచేయనని చెప్పినట్లు తెలిపారు.

- Advertisement -

తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. దుష్ప్రచారంతోనే మునుగోడు ఉప ఎన్నికలో ఓడించారని విమర్శించారు. కేసీఆర్‌(KCR)ను గద్దె దింపేందుకే బీజేపీలో చేరానని.. అది మోదీ, అమిత్ షా(Amit Shah) ద్వారానే సాధ్యమన్నారు. కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలిచినట్లు కాదని.. ఇక్కడి పరిస్థితులు వేరు అని రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) వెల్లడించారు.

Read Also: బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...