రాష్ట్రంలో ఉచిత విద్యుత్ వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతకుముందు అమెరికాలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొని మూడు గంటల కరెంట్ సరిపోతుందని చేసిన వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ తీవ్రంగా రియాక్ట్ అయింది. అయితే.. తాజాగా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
రాష్ట్రంలో రైతులకు 10 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదని తెలిపారు. ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రైతులకు 24 గంటల త్రీఫేజ్ కరెంటు ఎక్కడా ఇవ్వట్లేదని ఆరోపించారు. 24గంటల కరెంటు ఇచ్చినట్లు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) తెలిపారు.
Read Also: కేటీఆర్‌లా నేను అమెరికాలో బాత్రూంలు కడగలేదు: రేవంత్ రెడ్డి
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat