KomatiReddy Venkat Reddy: సొంతంగా ఫ్లైట్‌ కొంటారు కానీ.. సమస్యలు పరిష్కరించరా?

-

KomatiReddy Venkat Reddy Criticizes CM KCR Over VRA’s Problems: వంద కోట్లు పెట్టి సొంతంగా ఫ్లైట్‌ కొనుక్కోవచ్చు కానీ.. వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించలేరా అంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలదీశారు. భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆశయాల కోసం కృషి చేద్దామని వెంకట్‌ రెడ్డి(KomatiReddy Venkat Reddy) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించలేని వాళ్లు.. దేశం కోసం పార్టీని పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 మంది వీఆర్‌ఏలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదివేల మంది ఉన్న వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించలేకపోయారని అన్నారు. తెలంగాణ మెుత్తం బంగారం అయ్యిందనే.. దేశాన్ని బాగు చేస్తానని కేసీఆర్‌ బయలుదేరుతున్నారా అని ఎంపీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని సమస్యలను, ప్రజల వ్యతిరేకతను తప్పించుకోవటం కోసమే సీఎం కేసీఆర్‌ ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని వచ్చిన వీఆర్‌ఏల పట్ల వరంగల్‌లో ఏవిధంగా ప్రవర్తించారో అందరూ చూశారని కోమటిరెడ్డి అన్నారు.

Read Also: ప్రాణాలు తీసిన ఈత సరదా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...