Konda Surekha: భారత్ జోడో యాత్ర పై బీజేపీ అసత్యా ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పూనమ్ కౌర్ చేయి రాహుల్ కావాలని పట్టుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర పై బీజేపీ తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు మానుకోవాలన్నారు. పాదయాత్రలు చేస్తే జనంతో ఎలా ఉండాలో వారికి తెలిసేదని, కాంగ్రెస్ మహిళలను గౌరవించే పార్టీ అని.. ఆడవాళ్లను తల్లిలాగ చూసే పార్టీ అని కొనియాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులని బతిమిలాడే పరిస్థితి లేదన్నారు. వెంకటరెడ్డి తప్పు చేస్తే వెంటనే నోటిస్ ఇచ్చారని.. పార్టీ ఒకప్పటిలాగా ఇప్పుడు లేదని కొండా సురేఖ (Konda Surekha) అన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో జరుగుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీని హీరోయిన్ పూనం కౌర్ ఆదివారం కలిసి.. పాదయాత్రల్గొన్న విషయం తెలిసిందే.. అయితే రాహుల్ గాంధీని పూనమ్ కౌర్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మరింది. అయితే పోస్టుపై నటి పూనం కౌర్ స్పందిస్తూ.. తాను జారి పడబోతే రాహుల్ గాంధీ తన చేతిని పట్టుకున్నారని, ప్రీతి గాంధీ పెట్టిన పోస్టు చాలా అవమానకరంగా ఉందని ధ్వజమెత్తారు.
Read also: Kohli :కింగ్‌కు కోపం వచ్చింది!