టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP).. బీఆర్ఎస్(BRS)ను ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో తానే కాదు.. మరెవరూ కూడా పార్టీని వీడటం లేదని చెప్పారు. అంతేగాక, తనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) బీజేపీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని.. కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాలని సూచించారు. కాంగ్రెస్‌లోని మిగతా నేతలు కూడా బీజేపీలో చేరాలన్నారు. బీజేపీ అంటే సెక్యులర్ పార్టీ అని ..అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లిని కూడా బీజేపీలో చేరాలని కోరామన్నారు.