Revanth Reddy | ‘వారి మధ్య శాసనమండలిలో మాట్లాడటానికి కూడా భయపడ్డా’

-

శాసనసభ, శాసనమండలిలో పోడీ పడి ప్రసంగాలు ఇవ్వాలన్న స్ఫూర్తిని తమకు రోశయ్యే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఆయన ఎంతో శ్రమించారని, ఆయన కృషి కారణంగానే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అవతరించిందని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఆయన వల్లే తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రంగా అవతరించిందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఆయన నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆయన స్ఫూర్తి కారణంగానే ఈరోజున ఈ స్థాయిలో ఉన్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో నిర్వహించిన రోశయ్య మూడో వర్ధంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు.

‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లే రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడింది. చుక్క రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడటానికి నేను భయపడ్డా. నీటి పారుదల శాఖ పైన మండలిలో మాట్లాడినప్పుడు నన్ను రోశయ్య తన ఛాంబర్‌కు పిలిపించుకొని ప్రోత్సహించారు.

బాగానే మాట్లాడుతున్నావు కానీ కాస్తంత అధ్యయం చేసి మండలికి రావాలని సూచించారు. ఆరోజు ఆయన చేసిన సూచనలు నాకెంతో దోహదపడ్డాయి. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికీ మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు’’ అని అన్నారు రేవంత్(Revanth Reddy).

‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు. సీఎంగా, గవర్నర్ గా, వివిధ హోదాల్లో 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించిన వ్యక్తి రోశయ్య.

తమిళనాడు గవర్నర్‌గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు.. కానీ రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. ఆ నాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు’’ అని పేర్కొన్నారు.

‘‘ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడేవారు రోశయ్య. నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు.

రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి. సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది. వారు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుంది.

రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం. నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లైవుతుంది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.

Read Also: కొడకా.. అంటూ కోమటిరెడ్డిపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...