ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమర్పించారని రుజువవ్వడంతో తెలంగాణలో మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. గద్వాల(Gadwal) బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(Krishna Mohan Reddy)పై తెలంగాణ హైకోర్టు గురువారం అనర్హత వేటు వేసింది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల చెల్లదని తీర్పు ఇచ్చింది. రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్న డీకే అరుణ(DK Aruna)ను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తుది తీర్పు చెప్పింది.
ఇటీవల ఇదే కారణం చేత కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు విధించిన విషయం తెలిసిందే. తాజాగా.. అనర్హత వేటుపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(Krishna Mohan Reddy) స్పందించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని అన్నారు. 2014లో చూపించిన ప్రాపర్టీని 2018లో అమ్మేశానని అన్నారు. దొడ్డిదారిన కోర్టుకెళ్లడం సిగ్గుచేటని బీజేపీ నేత డీకే అరుణను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. ప్రస్తుతం కోర్టు ఒకవైపు వాదనలే వినిందని, సుప్రీంకోర్టులో నా తరపు నుంచి క్లారిటీ ఇస్తానని చెప్పారు.