తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని అన్నారు. 4 వేల పెన్షన్లు, 24 గంటల కరెంట్ ఇస్తాం అంటున్నారని తెలిపారు. ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదో గ్రామాల్లో ప్రశ్నించాలని ప్రజలకు కేటీఆర్ సూచించారు. ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒకాయన అడుక్కుంటున్నడు.. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ పథకాలు కొనసాగిస్తాం అని బీజేపీ(BJP) నాయకులు అంటున్నారు’ అని గుర్తుచేశారు.
కేసీఆర్ పథకాలు కొనసాగించాకా మీరెందుకు పీకడానికి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంపద పెంచాలి, పేదలకు పంచాలి మా నినాదం అని అన్నారు. సంచులు మోసినా వాడు కూడా నీతులు పలుకుతున్నాడని విమర్శించారు. సంచులు మోసి, జైల్లో చిప్ప కూడు తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ(PCC) పదవి అదొక పదవా, ప్రైమ్ మినిస్టర్ పదవి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. వీళ్లకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారని అడిగారు.