తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను(KCR Birthday) తెలంగాణభవన్‌లో ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. వీటిలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్ బర్డ్‌డే సందర్భంగా కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao), శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ పై రూపొందించిన డాక్యూమెంటరీని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.
కేసీఆర్ 71వ పుట్టినరోజు(KCR Birthday) సందర్భంగా తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) 71 కేజీల కేక్ కట్ చేశారు కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్.. తెలంగాణ కారణజన్ముడు. ఆయన మళ్ళీ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి గట్టిగా పనిచేద్దాం. రానున్న మూడున్నరేళ్లు 60 లక్షల గులాబీ దండు మొత్తం ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.