KTR | ‘ఖబడ్దార్ రేవంత్’.. సీఎంకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

-

మానుకోట(Manukota)లో పోలీసులు 144 సెక్షన్ విధించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మానుకోటలో ఏం జరుగుతోందని ప్రశ్నిస్తూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి? అక్కడ గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు? అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ? శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది ? ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన. ఖబర్దార్ రేవంత్.. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది’’ అని హెచ్చరించారు.

- Advertisement -

అయితే లగచర్లలో రైతుల అరెస్ట్‌లను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించాలని భావించింది. కానీ అందుకు అనుమతులు లభించలేదు. ఈ ధర్నాకు కేటీఆర్(KTR) కూడా హాజరుకానున్నారని ముందుగానే ప్రకటించారు. ఈ ధర్నాకు అనుమతులు రాకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాలోతు కవిత(Maloth Kavitha), రవీందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్ సహా పలువురు నేతలు ఎస్పీ కార్యాలయం ఎదుట రాత్రి 11 గంటల వరకు నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు నిర్వహించారు. ఇది అల్లర్లకు దారితీసే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు ముంద జాగ్రత్త చర్యలుగా మానుకోటలో సెక్షన్ 144 అమలు చేస్తున్నారు.

Read Also: కోర్టు మెట్లెక్కిన పట్నం నరేందర్ రెడ్డి భార్య..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...