హైదరాబాద్ మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్(KTR) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మెట్రో అధికారులు, ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం అని అభిప్రాయపడ్డారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే మెట్రోను విస్తరించక తప్పదన్నారు. విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా బలోపేతం కావాలన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలన్నారు. 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరిన్ని కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.