బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఈరోజు చర్లపల్లి జైలుకు వెల్లారు. అక్కడ పోలీసులు కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)తో ములాఖాత్ అయ్యారు. ఆయనతో కేటీఆర్ పలు అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా అతనికి పార్టీ అండగా నిలుస్తుందని కూడా భరోసా కల్పించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కోర్టుకాకుంటే పైకోర్టుకు వెళ్లైనా పట్నం నరేందర్‌కు న్యాయం జరిగేలా చూస్తామని, ప్రతి అడుగులో బీఆర్ఎస్ వెంట ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారని సమాచారం. ఇందులో కేటీఆర్ వెంట పట్నం నరేందర్ భార్య పట్నం శృతి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహముద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు.
Patnam Narender Reddy – KTR | అయితే లగచర్లలో కలెక్టర్ సహా ఇతర అధికారులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి పోలీసులు పట్నం నరేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి జరిగేలా చేయడం వెనక పట్నం హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రైతులు, స్థానికులను దాడికి ఉసిగొల్పిన లగచర్ల సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ ప్రధాన అనుచరుడిగా గుర్తించిన పోలీసులు.. ఘటనకు ముందు వీరిద్దరు పలుసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు కూడా నిర్ధారించారు. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా పట్నం నరేందర్‌ను అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.