KTR | ఆటో డ్రైవర్లకు కేటీఆర్ మద్దతు..

-

ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ‘మహాధర్నా’లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు తాము అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తాను మహాలక్ష్మీ పథకానికి వ్యతిరేకం కాదని, కానీ ఆటో డ్రైవర్ల కష్టాలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ సందర్బంగానే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వడం కాదని, నెలకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘ఆడ పిల్లలు మహాలక్ష్మీ పథకం వల్ల బస్సుల్లో కొట్టుకోకుండా చూడాలి. ఆటో డ్రైవర్లకు చావే గతికాకుండా అడ్డుకోవాలి. అందుకోసం వారికి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వడం కాదు. నెలకు రూ.5 వేలు ఇవ్వాలి. దాంతో పాటుగా ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. కేసీఆర్ తెచ్చని బీమాను కూడా రద్దు చేశారు. తెలంగాణలో పోలీసులు కూడా కష్టాల్లోనే ఉన్నారు. వాళ్ల కుటుంబీకులు కూడా రోడ్డెక్కారు. సచివాలయంలో స్పెషల్ పోలీసులను తొలగించి బెటాలియన్‌ను దించారు’’ అని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

‘‘ఆటో డ్రైవర్ల(Auto Drivers) సామర్థ్యం ఏంటో మాకు బాగా తెలుసు. మమ్మల్ని ఓడించడంలో వారి పాత్ర కూడా ఉంది. ఇదే ప్రభుత్వాన్ని ఇంకా నాలుగేళ్ల భరించాలి. ఈ నాలుగేళ్లు కూడా ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. అన్ని జెండాలు ఒక్కటై పోరాటం చెయ్యాలి. కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలి. ప్రభుత్వంతో కలిసి ఉన్నా ఏఐటీయూసీ ఉద్యమించడానికి రోడ్డెక్కింది. సీఐటీయు వంటి సంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. వారందరికీ బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం అంతా కలిసి నినాదిద్దాం’’ అంటూ కేటీఆర్(KTR) నినాదాలు చేశారు.

Read Also: అసమ్మతి నేతలపై శివసేన వేటు!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...