KTR | ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు: కేటీఆర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను చిన్న చూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదని ఫైర్ అయ్యారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -

ముఖ్యమంత్రి గారు..

రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?

నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..

నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..

ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా…?

అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??

ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?

సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..??

ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..?

పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ??

పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ?

హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ?

ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..!

ఇప్పుడు.. నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..?

గుర్తు పెట్టుకోండి..!! ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదు ..” !!

అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై..

భారత “రైతు” సమితి.. పోరాడుతూనే ఉంటది..!!!’ అని కేటీఆర్(KTR) ట్వీట్ చేశారు.

Read Also: తెలంగాణ గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ramamurthy Naidu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం

తమ్ముడు నారా రోహిత్(Nara Rohit) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu)...

Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్

Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...