KTR Reacted on the lure of 4 TRS MLAs in Moinabad Farm House: తెలంగాణ రాష్ట్రంలో TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని అధికార TRS పార్టీ నేతలు, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయ వేడిని రాజేస్తున్నారు. ఇది కేసీఆర్ డ్రామా అంటూ బీజేపీ విమర్శిస్తుంటే, ఇది బీజేపీ కుట్రలో భాగమేనంటూ టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో గులాబీ చిన్న బాస్, మంత్రి కేటీఆర్(KTR) పార్టీ నేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. “ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ ట్విట్టర్ వేదికగా తమ శ్రేణులకు సూచించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి
అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం
లేదు— KTR (@KTRTRS) October 27, 2022
కాగా అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు మొయినాబాద్ ఫామ్ హౌజులో బేరసారాలు జరుపుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు డబ్బు కట్టలతో సహా వారిని అరెస్టు చేసినట్టు బుధవారం రాత్రి వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిని రామచంద్రభారతి, సింహయాజులు స్వామి, నందకుమార్, తిరుపతి లుగా గుర్తించారు పోలీసులు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి లతో ఫామ్ హౌజ్ లో బేరసారాలు జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.