వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్(KTR) తొలిసారి స్పందించారు. ఆడబిడ్డకు అన్యాయం చేసిన ఎవరినీ వదలిపెట్టబోమని అన్నారు. ప్రీతి ఆత్మహత్యకు కారణమైంది సైఫ్ అయినా, సంజయ్ అయినా వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. నిందితులను చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ప్రీతి ఘటనను కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చినా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి మరణం అందరినీ కలచివేసిందన్నారు. ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నామన్నారు.