తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి(Jeevan Reddy).. ఓ మహిళపై చేయి చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు. మహిళ చెంపపై కొట్టడం దుర్మార్గపు చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ దురహంకారమని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
అయితే ఈ వీడియోపై జీవన్ రెడ్డి స్పందిస్తూ తాను ఆప్యాయంగానే ఆ మహిళను కొట్టానని వివరణ ఇచ్చుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో జీవన్ రెడ్డి(Jeevan Reddy) ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఓ మహిళను పలకరించగా.. ఆమె ఆయనను గుర్తించలేదు. తనను వినయ్ రెడ్డి అని పిలవడంతో జీవన్ రెడ్డి ఆమెను చెంప మీద కొట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A video has surfaced from Nizamabad #Telangana where @INCIndia candidate @jeevanreddyMLC slapped an old woman.
The women was enquiring about her pension which she has not received in few months and then Jeevan Reddy asked whom she voted for. She didn't recognise him, and called… pic.twitter.com/rO7E6FQxgx
— South First (@TheSouthfirst) May 4, 2024