KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

-

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ రేసు కేసుకి సంబంధించి ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని మళ్ళీ నోటీసులు పంపింది. అయితే మరో విషయం చాలా స్పష్టంగా నోటీసుల్లో పేర్కొంది. మీ లీగల్ టీమ్ కి నో ఎంట్రీ అని కేటీఆర్ కి తేల్చి చెప్పింది. లాయర్లను వెంటేసుకొస్తే లోపలికి అనుమతి ఉండదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేటీఆర్ ఈసారైనా తన లాయర్ లేకుండా విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

కాగా, ఫార్ములా- ఈ రేసు(Formula E Race) కేసు విచారణలో భాగంగా కేటీఆర్ సోమవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఏసీబీ నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయన నేటి ఉదయం విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు. అధికారుల ఎదుట హాజరవకుండానే తన వర్షన్‌ను లిఖితపూర్వకంగా సమర్పించిన అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్‌ కి వెళ్ళిపోయారు.

ACB ఆఫీసు వద్ద ఉద్రిక్తత…

కేటీఆర్(KTR) ఏసీబీ ఆఫీసుకి వెళ్లిన తర్వాత అక్కడ హైడ్రామా నడిచింది. ఆయన తన లాయర్‌తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. కానీ న్యాయవాది కేటీఆర్ వెంట వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వారి వాహనాన్ని ఏసీబీ కార్యాలయం వెలుపల నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తన లాయర్‌ కు అనుమతి లేదని పోలీసులు పట్టుబట్టడంతో… కేటీఆర్ తన లాయర్‌కు అనుమతి లేదని రాతపూర్వకంగా ఇవ్వాలని పోలీసులను కోరారు.

లాయర్ ని అనుమతించకపోతే తాను రోడ్డుపైనే వెయిట్ చేస్తానని… లేదంటే పోలీసులకు లిఖితపూర్వక వివరణ సమర్పించి ఇక్కడ నుంచి వెళ్లిపోతానని కేటీఆర్ కూడా పట్టుబట్టారు. సుమారు 40 నిమిషాలపాటు పోలీసులు, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ పోలీసులు కేటీఆర్ న్యాయవాదికి లోనికి అనుమతి లేదని చెప్పడంతో అసహనానికి గురై వెనుదిరిగి వెళ్ళిపోయారు.

లిఖితపూర్వక స్టేట్మెంట్…

ఏసీబీ కేటీఆర్ కి అందజేసిన నోటీసులో, కొన్ని డాక్యుమెంట్స్ తో సహా మొత్తం సమాచారాన్ని అందించాలని కోరింది. అయితే, ఏసీబీ తన నుంచి కోరిన సమాచారం గురించి కానీ, ఎలాంటి పత్రాలు కావాలో అనే అంశాలు నోటీసులో స్పష్టంగా పేర్కొనలేదని కేటీఆర్ తెలిపారు. అలాగే తన వర్షన్ ని ఏఎస్పీకి రాతపూర్వకంగా సమర్పించి వచ్చినట్లు వెల్లడించారు.

డిసెంబర్ 18న కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేసు కేసు నమోదైంది. దీనిపై ఆయన హైకోర్టులో సవాలు చేశారు. డిసెంబరు 31న, కోర్టులో జరిగిన వాదనల అనంతరం, తీర్పును ప్రకటించే ముందు కేటీఆర్ ని అరెస్టును నిషేధిస్తూ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Read Also: టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...

Allu Arjun | అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ నోటీసులు

హీరో అల్లు అర్జున్(Allu Arjun) కి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు....