KTR Road Show: మునుగోడు ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. రాజకీయ పార్టీల నాయకులు, పార్టీ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అయితే.. నేడు మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్ షో (Road Show) ప్రారంభం అవుతుంది. చౌటుప్పల్‌లోని చిన్నకొండూరు చౌరస్తాలో ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడనున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొననున్నట్లు మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు వెల్లడించారు.