అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు 

-

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సాక్షిగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైద‌రాబాద్ అభివృద్ధి, భూముల విలువ‌ను చంద్ర‌బాబు గుర్తించారని తెలిపారు. తెలంగాణ‌లో ఎక‌రం అమ్మితే ఏపీలో 100 ఎక‌రాలు కొనొచ్చు అని చంద్ర‌బాబు అన్నారు. తెలంగాణ‌ అభివృద్ధిని ఒప్పుకున్న చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు చెబుతానని చెప్పారు. కేసీఆర్‌కు రైతుల‌పై ప్రేమ ఉన్నందునే మీట‌ర్ల‌కు ఒప్పుకోలేద‌ని చంద్ర‌బాబు చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

- Advertisement -

అలాగే దిశ ఘటన జరిగినప్పుడు తెలంగాణ‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా మెచ్చుకున్నారు. దిశ ఘ‌ట‌న విష‌యంలో ఐ సెల్యూట్ టు కేసీఆర్ అని మెచ్చుకున్న జ‌గ‌న్‌కు కూడా ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి గురించి పక్క రాష్ట్రంలో ఉన్న జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు అర్థ‌మైన విష‌యాలు సొంత రాష్ట్రంలోని విప‌క్షాల‌కు మాత్రం అర్థం కావ‌ట్లేదు అని కేటీఆర్ విమర్శించారు.

Telangana Assembly | అలాగే తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత మంచినీరు న‌ల్లాల ద్వారా అందుతుంద‌ని కేంద్ర మంత్రినే పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణ‌కే వ‌చ్చాయన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో మానేరు ఒడ్డున ఉన్న‌వారికి కూడా మంచినీరు అందేది కాదని గుర్తుచేశారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయ‌ని ప‌నుల‌ను 6 ఏళ్లలోనే చేసి చూపించామన్నారు. నీళ్ల కోసం ఆనాడు నీళ్ల మంత్రి జానారెడ్డి ద‌గ్గ‌ర‌కు వెళ్తే క‌న్నీళ్లు పెట్టించారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ డ‌బ్బా ఇండ్లు క‌ట్టించిందని.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్రం డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించి ఇచ్చిందని పేర్కొన్నారు. గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం కింద మ‌రింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ… వాక్స్వాతంత్రం ఉందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్‌ను ఏది పడితే అది మాట్లాడుతారా? అని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆయనపై వెయ్యి కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారని తెలిపారు. తనపై చేసిన రేవంత్ చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

అయితే కేటీఆర్ ఆరోపణలు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేయలేదని కేటీఆర్ అనడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏం చేయకపోతే కోకాపేట భూముల విలువ వంద కోట్లకు పలికిందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే.. ఆ ఫలాలు బీఆర్‌ఎస్ నేతలు అనుభవిస్తున్నారని జానారెడ్డి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

Read Also: బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...