రేవంత్ టూర్లపై కేటీఆర్ సెటైర్లు.. పైసా పనిలేదంటూ ట్వీట్..

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి ఢిల్లీ టూర్‌కు సిద్ధం కావడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు వేశారు. పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేదు.. అయినను పోయిరావలే హస్తినకు’ అన్న తరహాలో సీఎం రేవంత్ తీరు ఉందంటూ విసుర్లు విసిరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్.. ఢిల్లీకి వెళ్లడం తప్ప చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. దగ్గినా.. తుమ్మినా.. ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని, తెలంగాణ ప్రజలను పాలించడానికి ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లాల్సిన అవసరం ఏముందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినే పది నెలల కాలంలో ఢిల్లీలో 25 పర్యటించారని, అంటే రాను, పోను కలుపుకుని మొత్తం 50 సార్లు తెలంగాణ, ఢిల్లీల మధ్య ప్రయాణం చేసిన ఘనత రేవంత్‌దే అంటూ పంచులు పేల్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను మడతబెట్టి మూలపడేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్న సీఎం మాత్రం హస్తినకు పోయిరావాల్సందే అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.

- Advertisement -

‘‘పైసా పనిలేదు – రాష్ట్రానికి రూపాయి లాభం లేదు

10 నెలలు – 25 సార్లు – 50రోజులు

పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు

అయినను పోయి రావాలె హస్తినకు

అన్నదాతల అరిగోసలు
గాల్లో దీపాల్లా గురుకులాలు
కుంటుపడ్డ వైద్యం
గాడి తప్పిన విద్యా వ్యవస్థ

అయినను పోయి రావాలె హస్తినకు

మూసి పేరుతో – హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి – 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి

అయినను పోయి రావాలె హస్తినకు

పండగలు పండగళ్ళా లేవు ఆడబిడ్డల చీరలు అందనేలేవు అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు తులం బంగారం జాడనే లేదు స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు

అయినను పోయి రావాలె హస్తినకు’’ అని కేటీఆర్(KTR) ట్వీట్ చేశారు.

Read Also: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సంజీవ్.. సిఫార్స్ చేసిన చీఫ్ జస్టిస్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...

Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...