రంగారెడ్డి జిల్లా అమన్ గల్ లో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) త్వరలో శాసనసభ సభ్యునిగా ఎన్నిక కానున్నట్లు కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలలో విద్యార్థులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేద విద్యార్థుల కోసం 1022 గురుకుల పాఠశాలలను కడితే వాటిని సంరక్షించడం ఈ ప్రభుత్వానికి చేతకావట్లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని, అలాగే మోసం చేయని వర్గం కూడా లేదని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెసోళ్లు మళ్ళీ మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సారి మోసపోతే ఈ పాలనా నుండి ఎవరూ కూడా కాపాడలేరు అని కేటీఆర్(KTR) అన్నారు. ఇంటికొచ్చే ప్రతి కాంగ్రెస్ నాయకుడిని ఇచ్చిన హామీలపై నిలదీయాలని కేటీఆర్ కోరారు. రైతులు లోన్స్ కట్టలేదని బ్యాంకు వాళ్ళు ఇంటి గేట్, పొలం దగ్గర స్టాటర్ ఎత్తుకెళ్లిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలానే ఉంటె రేపో మాపో ఆడబిడ్డల పుస్తలతాడు ఎత్తుకెళ్తాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని ఇప్పుడు రూ. 12 వేలు అంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి రైతుకి ప్రతి ఎకరాకు రూ. 17500 బాకీ ఉంది ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కి రియల్ ఎస్టేట్ తప్పా స్టేట్ గురించి బాధ లేదని అన్నారు.