తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రారంభించనున్నారు. ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్(KTR) రేపు సచివాలయంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి అడుగుపెట్టబోతున్నారు. నూతన సచివాలయంలో కేటీఆర్కు కేటాయించిన మూడో అంతస్తులో నుంచి విధులు నిర్వర్తించనున్నారు. ఆయన చాంబర్లో మొదటి సంతకం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వుల పైలుపై తొలి సంతకం చేయనున్నారు.
- Advertisement -
Read Also: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సందేశం
Follow us on: Google News, Koo, Twitter