Revanth Reddy | జైలుకెళ్లడానికి కేటీఆర్ తపనపడుతున్నారా..?

-

మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. జైలుకు వెళ్లడం కోసం ఆత్రుతగా ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదానీ(Adani) లాంటి వారిని కేసీఆర్(KCR) దగ్గరకు కూడా రానివ్వలేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారని, అసలు అదానీని వెళ్లి కలిసిందే ఈ తండ్రీకొడుకులంటూ చురకలంటించారు. అదానీతో కేసీఆర్ ఒప్పందాలు చేసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

- Advertisement -

‘‘అదానీతో మా ప్రభుత్వమే ఏదో వ్యాపారం చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం.. అదానికి ఎన్నో ప్రాజెక్ట్‌లు ఇచ్చింది. అదానీతో అంటకాగింది. అదానీ వద్ద కమీషన్లు తీసుకున్నది ఎవరు. అదానీని కలిసింది కేసీఆర్, కేటీఆర్(KTR) కాదా? కేటీఆర్ ఇప్పుడు జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని అనుకుంటున్నారు కాబోలు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి ఐదు నెలల ఉండి వచ్చారు. జైలుకెళితే సీఎం అవుతారంటే.. ఈ రేసులో ముందు కవిత(MLC Kavitha) ఉంటారు. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం సీటుకు గట్టి పోటీ ఉంది’’ అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చురకలంటించారు.

Read Also: ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనౌన్స్ చేసిన విష్ణు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...