KTR’s Father in law Passes Away: తెలంగాణ మంత్రి కేటీఆర్ భార్య శైలిమ తండ్రి హరినాధరావు హఠాన్మరణం చెందారు. 72 సంవత్సరాల హరినాధరావు గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు తుదిశ్వాస విడిచారు. మంగళవారం సాయంత్రం గుండెనొప్పిగా ఉందంటూ బాధపడుతున్న హరినాధరావును కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేషన్ పై చికిత్స అందించారు వైద్యులు. చికిత్సకు ఆయన శరీరం సహకరించక ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. కాగా ఈ చేదు వార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కుటుంబ సభ్యులతో కలిసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం హరినాధరావు మృతదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్: మంత్రి KTR కుటుంబంలో తీవ్ర విషాదం
-