‘మహిళా రెజ్లర్లకు ప్రధాని క్షమాపణ చెప్పాలి’

-

మహిళా రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) అన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్ల(Women Wrestlers)పై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులు చేశారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశానికి ఎన్నో పతకాలు గెలిచి కీర్తి సంపాదించి పెట్టిన క్రీడాకారులపై రెజ్లర్ల శిక్షణ విభాగానికి చీఫ్ కోచ్ గా ఉన్న ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, గత 35 రోజులుగా రెజ్లర్లు తీవ్ర నిరసన తెలుపుతున్నా, దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహవేషాలు వ్యక్తం చేస్తున్నా ఇప్పటికీ ఎంపీని అరెస్టు చేయకపోవడం మహిళల పట్ల బీజేపీకి ఉన్న వైఖరికి అద్దం పడుతున్నదని కూనంనేని(Kunamneni) విమర్శించారు. ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించబడుతుంటే, తప్పు చేసిన వారు రాజులాగా యదేచ్ఛగా బయట తిరుగుతున్నారని తెలిపారు. బేటి బచావో బేటి పడావో(Beti Bachao Beti Padhao) అనే పేరుతో ఆడపిల్లలను చదివించు, రక్షించు అని చెబుతూనే మహిళలను భక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ(PM Modi) నైతిక బాధ్యత వహించి మహిళలకు క్షమాపణ చెప్పాలని, బ్రిజ్ భూషణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
Read Also:
1. యోగి ఆదిత్యనాథ్ పాలనలోనే ఇది సాధ్యం..!!
2. రాత్రి భోజనం తర్వాత తీసుకోవాల్సిన డిన్నర్ టీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...