కార్మికులకు జాతీయ భద్రత అవసరం: బండారు దత్తాత్రేయ

Bandaru Dattatreya

కార్మిక చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) అన్నారు. దేశంలో కార్మికులకు జాతీయ భద్రత అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో యూసఫ్ గూడాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహించిన జాతీయ సింపోజియం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు మార్పు చెందాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలని… కార్మిక చట్టాల అమలులో కేంద్ర ప్రభుత్వం ముందుంటుందని దత్తాత్రేయ వెల్లడించారు.

Read Also:
1. జనసేన-టీడీపీ పొత్తుపై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here