Lal Darwaza Bonalu | తెలంగాణ లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి(Ujjain Mahankali) అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్… కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రతీ సంవత్సరం ఇది ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ సంవత్సరం మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అందువల్ల ఈ సంవత్సరం కూడా 5 లక్షల మంది దాకా వస్తారనే అంచనా ఉంది. అలాగే అమ్మవారి దర్శనం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు పెద్ద సంఖ్యలో రానున్నారు. అందుకే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా సీసీ టీవీల నిఘా ఉంది. మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read Also: ప్రధాని మోడీ సమక్షంలో కేసీఆర్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat