హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్(Neera Cafe)కు భారీ డిమాండ్ ఏర్పడింది. కేఫ్ ప్రారంభం అయినప్పటి నుంచి నీరా రుచి కోసం జనం బారులు తీరుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో నగర వాసులు క్యూ కట్టారు. ఉదయం 10గంటలకు కేఫ్ ఓపెన్ అవ్వగా.. మధ్యాహ్నం వరకే సుమారు 1500 నుంచి 2000 మంది కేఫ్‌కు వచ్చారని.. దాదాపు 300 లీటర్లపైగా అమ్మకాలు జరిగాయని సిబ్బంది తెలిపారు. 300ml క్వాంటిటీ కలిగిన నీరా బాటిల్ కేవలం 90 రూపాయలు మాత్రమే కావడంతో సేల్స్ ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రకృతి సిద్ధమైనది కావడంతో పాటు ఎన్నో ఔషధగుణాలు నీరాలో ఉన్నందున జనం ఎగబడి కొంటున్నారు. హుస్సేన్ సాగర తీరంలో నీరాను తాగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ చిల్ అవుతున్నారు నగరవాసులు.
Read Also: అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకం
Follow us on: Google News, Koo, Twitter