Liquor Shops | మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ(Excise Department) ప్రకటించింది. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేరస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మద్యం దుకాణాలే కాకుండా బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాల్లో ఈ ఆదేశాలు అమలు కానున్నాయి.
Liquor Shops | ఉపాధ్యాయ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల పరిధిలో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుందని, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పట్టభద్రల స్థానంలో 56 మంది, టీచర్ల స్థానంలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.