Loan Apps Harassment in Karimnagar district Telangana: లోన్ యాప్‌ల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత సూచించిన యువత అప్పుల ఊబిలో ఇరుక్కుంటున్నారు. లోన్ యాప్‌ల విధులు చట్ట విరుద్ధంగా ఉన్నాయనీ, వాటి వివరాలను ఆర్బీఐ వెబ్ సైట్‌లో చూడవచ్చునని పోలీసులు ఎంత ఎవేర్ నేస్ కల్పించిన లోన్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి అప్పులు కట్టలేక.. ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ లోన్ యాప్ వేదింపులకు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్‌కు చెందిన శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం కోసం లోన్ యాప్ ద్వారా రూ.3లక్షలు లోన్ తీసుకున్నాడు. కాగా అప్పు కట్టమని.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు(Loan apps Harassment) ఎక్కువ కావడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.