Lok Poll Survey | మరో రెండు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన BRS అధిష్టానం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేసింది. భారీ ఎత్తున సంక్షేమ పథకాలతో కూడిన మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక విపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికార పార్టీ నిలబెట్టిన నాయకులను ఓడించే సత్తా కలిగిన బలమైన నాయకుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో లోక్ పోల్ సంస్థ బయటపెట్టిన సర్వే ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. మూడోసారి కూడా ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకుంటున్న కేసీఆర్ కి షాక్ ఇచ్చేలా సర్వే ఫలితాలు ఉండడంతో పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ లోక్ పోల్ సర్వే వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. గులాబీ శ్రేణులకు గుబులు పుట్టిస్తున్న సర్వే ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 10 నుండి సెప్టెంబరు 30 వరకు సర్వే నిర్వహించిన లోక్ పోల్ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడించింది. అంతేకాకుండా, ఓట్ షేర్ ని కూడా ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 67 స్థానాలు వస్తాయని, ఆ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అధికార బీఆర్ఎస్ పార్టీ 45 నుంచి 51 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. బీజేపీ మాత్రం 2 నుంచి 3 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని తెలిపింది. ఎంఐఎం పార్టీకి 6-8 స్థానాలు వస్తాయని.. ఇతరులు 0-1 స్థానాలు దక్కించుకుంటారని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 41-44% ఓట్లు వస్తాయని.. బీఆర్ఎస్ పార్టీకి 39-42% ఓట్లు, బీజేపీకి 10-12% ఓట్లు, ఎంఐఎం 3-4%, ఇతరులు 3%-5% ఓట్లు కైవసం చేసుకుంటారని లోక్ పోల్ సర్వే పేర్కొంది.
ప్రజలపై కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీ పథకాలు ప్రభావం చూపిస్తున్నాయని లోకోపోల్ సర్వే(Lok Poll Survey) తెలిపింది. బీసీలు, మైనారిటీల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోందని పేర్కొంది. ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం, స్థానిక నేతలపై ప్రజల అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని లోకోపోల్ తన సర్వే ద్వారా వెల్లడించింది. సీఎం కేసీఆర్పై గ్రామస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోందని అభిప్రాయపడింది. రైతులు, నిరుద్యోగుల్లో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించింది. అటు పాతబస్తీలో ఎంఐఎం పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకుంది. బీజేపీ మాత్రం తెలంగాణలో భారీగా ఓట్ బ్యాంకును కోల్పోయింది. కాగా గతంలో కర్ణాటక ఎన్నికల్లో లోకోపోల్ సర్వే అక్షరాలా నిజమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 129-134 స్థానాలు, బీజేపీకి 59-65 స్థానాలు వస్తాయని లోక్ పోల్ సంస్థ సర్వే వెల్లడించింది.
After conducting a thorough ground survey from August 10th to September 30th across the state, we are pleased to present the results of the Mega #Telangana pre-poll survey.
▪️BRS 45 – 51
▪️INC 61 – 67
▪️AIMIM 6 – 8
▪️BJP 2 – 3
▪️OTH 0 – 1… pic.twitter.com/QulbMAbmmQ— Lok Poll (@LokPoll) October 5, 2023