Lovers suicide: రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

-

Lovers suicide at Bahupet in Yadadri Bhuvana giri district: యాదగిరిగుట్ట మండలం బహుపేటలో రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ట్రాక్‌పై రెండు మృతదేహాలు ఉన్నాయని గమనించిన రైల్వే సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. వీరిద్దరూ కనిపించటం లేదంటూ యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని.. ఆ కనిపించకపోయిన వారిద్దరే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, మృతి చెందిన యువతికి ఇటీవలే వివాహం అయినట్లు స్థానికులు చెప్తున్నారు. రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు, పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గత రెండు రోజుల వ్యవధిలో ప్రేమ జంటల ఆత్మహత్యలు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. నిన్న తిరుపతిలో ఓ లాడ్జిలో ఓ జంట ఆత్మహత్య (Lovers suicide) చేసుకోగా, ఆ యువతికి ఇదివరకే పెళ్లి అయిన విషయం విదితమే. ఇష్టం లేని పెళ్లిల్లు చేయటం, లేదా వివాహ బంధానికి ముందు మరొకరితో ప్రేమాయణం నడపటం వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...