టీపీసీసీ చీఫ్(TPCC Chief) నియామకం కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు అందుకోనున్నారన్న క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సస్పెన్స్‌కు ఏసీసీ తెరదింపింది. తెలంగాణ పార్టీ పగ్గాలను బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్‌ను అప్పగిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ నియామకాన్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధ్యక్ష పదవికి గట్టి పోటీ జరిగినప్పటికీ బీసీ నేతకే ఏఐసీసీ పెద్దపీట వేసింది. మహేష్ కుమార్ నియామకం విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీకాలం జూలై 7తో ముగిసింది. అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే కాంగ్రెస్ వర్గాల్లో కీలకంగా మారింది. ఈ పదవికి ఎక్కువ పోటీ ఉండటంతో నెక్స్ట్ టీపీసీసీ అధ్యక్షుడు(TPCC Chief) ఎవరన్నది మరింత ఉత్కంఠ భరితంగా మారింది. కాగా చివరకు బీసీ నేత మహేష్ కుమార్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది.