Malla Reddy | ఈడీ నోటీసులపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ..

-

పీజీ మెడికల్ సీట్ల వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy)కి ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలు తెలంగాణ రాష్ట్రమంతా హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై మల్లారెడ్డి స్పందించారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన చెప్పారు. తమ ఇంటికి ఈడీ నుంచి నోటీసులు వచ్చిన మాట వాస్తవమేకానీ, తనకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్పారాయన. ‘‘గతేడాది మాకు చెందిన కళాశాలల్లో ఈడీ సోదాలు జరిగిన మాట వాస్తవమే. ఆ విచారణకు హాజరుకావాలని నోటీసులు వచ్చాయి. అందులో కొత్తేమీ లేదు. అయినా నోటీసులు నాకు రాలేదు. మా కొడుక్కు వచ్చాయి’’ అని చెప్పారాయన.

- Advertisement -

మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. పీజీ మెడికల్ సీట్ల విషయంలో అక్రమాలు జరిగాయని గుర్తించడంతోనే ఈడీ ఈ నోటీసులు(ED Notice) జారీ చేసిందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూనే మల్లారెడ్డి(Malla Reddy)కి నోటీసులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మల్లారెడ్డి తన వ్యాఖ్యలతో ఫుల్ స్టాప్ పెట్టారు. అంతేకాకుండా తనపై ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Read Also: రేవంత్‌పై కేసులు నమోదు చేసే ఆదేశాలివ్వండి.. నో చెప్పిన హైకోర్టు

Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...